: మార్చి మూడో వారంలో 'సడక్ బంద్'
తెలంగాణా వాదులు తలపెట్టిన 'సడక్ బంద్'ను మార్చి మూడో వారంలో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ రోజు (ఆదివారం) జరగాల్సిన ఈ సడక్ బంద్ ను బాంబు పేలుళ్ళ దృష్ట్యా వాయిదా వేసుకున్న విషయం మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణా జేఏసీ ముఖ్య నాయకులు శనివారం నాడు సమావేశమై తమ కార్యాచరణను చర్చించారు. ఈ సందర్భంగా సడక్ బంద్ ను మార్చి మూడో వారంలో నిర్వహించాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు.