: లోక్ సభ వాయిదా
లోక్ సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. సీమాంధ్ర టీడీపీ ఎంపీల ఆందోళనలు, నిరసనల మధ్య లోక్ సభలో గందరగోళం నెలకొంది. టీడీపీ ఎంపీలకు తోడు కాంగ్రెస్ ఎంపీలు కూడా ప్లకార్డులు ప్రదర్శించారు. దీంతో సభను 12 గంటలకు వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ మీరాకుమార్ ప్రకటించారు. ఈరోజు ఆహారభద్రత బిల్లుపై ఓటింగ్ జరిగే అవకాశముంది. కాంగ్రెస్ పార్టీ తమ ఎంపీలంతా అందుబాటులో ఉండాలని విప్ కూడా జారీ చేసింది.