: నేటి నుంచే ఐబీఎల్ సమరం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తరహాలో ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్) నేటి నుంచి క్రీడాప్రియులను అలరించనుంది. ఈ నెల 31 వరకూ జరగనున్న ఈ పోటీల్లో ఆరు జట్లు పాల్గొంటున్నాయి. ఈ జట్లలో ఎంతో మంది ప్రముఖ క్రీడాకారులు ఉన్నారు. ఐబీఎల్ ప్రారంభోత్సవం ఈ సాయంత్రం 6.30గంటలకు ఢిల్లీలో జరుగుతుంది. రాత్రి 8 గంటల నుంచి ఢిల్లీ వేదికగా ఢిల్లీ స్మాషర్స్, పుణె పిస్టన్స్ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరుగుతుంది.