: ప్రైవేటు ట్రావెల్స్ కు పండగే


సీమాంధ్ర ప్రాంతంలో బంద్ ను ప్రైవేటు ట్రావెల్స్ క్యాష్ చేసుకుంటున్నాయి. పలు ప్రాంతాల నుంచి హైదరాబాద్ కు వెళ్లే సర్వీసులలో ప్రయాణికుల నుంచి అందిన కాడికి దోచుకుంటున్నారు. మంగళవారం రాత్రి విశాఖపట్నం నుంచి హైదరాబాద్ కు ప్రైవేటు ట్రావెల్స్ ఆపరేటర్లు ఒక్కో ప్రయాణికుడి నుంచి 2,500 రూపాయలు వసూలు చేశారు. సాధారణ రోజులలో చార్జీ 800 రూపాయలే. బస్సులు లేక, రైళ్లలో సీట్లు దొరక్క గత్యంతరం లేని పరిస్థితుల్లో కొందరు అడిగినంత చెల్లించి రాజధానికి ప్రయాణమయ్యారు. ఈ విషయం తెలియడంతో కొందరు సమైక్యాంధ్ర ఉద్యమకారులు ఆగ్రహంతో ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను అడ్డగించి టైర్లలో గాలి తీసేశారు. మరోవైపు, బంద్ నేపథ్యంలో అధిక చార్జీలను వసూలు చేస్తే సహించబోమని అనకాపల్లి ఎంపీ సబ్బం హరి హెచ్చరించారు.

  • Loading...

More Telugu News