: ఒక్క ఏడాదిలో 11 లక్షల అబార్షన్లు


దేశంలో గర్భస్రావాల సంఖ్య నానాటికీ పెరిగిపోతోందని ఆరోగ్య శాఖ నివేదికలు చెబుతున్నాయి. ఒక్క 2008-09లో దేశంలో జరిగిన అబార్షన్ల సంఖ్య 11 లక్షల 6 వేలు అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గులాంనబీ ఆజాద్ తెలిపారు. అయితే, ఈ సంఖ్య సురక్షిత గర్భస్రావాలదని ఆజాద్ తెలిపారు. అరక్షిత మార్గాల్లో జరిగే అబార్షన్ల సంఖ్య చెప్పలేమన్నారు. వీటి సంఖ్య చాలా ఎక్కువే ఉండొచ్చని ఆయన అన్నారు. సురక్షిత గర్భస్రావాల కోసం రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు నిధులు కేటాయిస్తున్నామని ఆజాద్ వెల్లడించారు. 8 శాతం మాతృ మరణాలు ఇలాంటి అరక్షిత అబార్షన్ల కారణంగానే సంభవిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News