: ఉద్యమకారులపై లాఠీఛార్జ్
విశాఖపట్నంలో సమైక్యాంధ్ర ఉద్యమకారులపై పోలీసులు ప్రతాపం చూపించారు. మద్దిలపాలెంలోని కూడలిలో బంద్ సందర్భంగా ఆందోళనకారులు వాహనాలను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు లాఠీఛార్జ్ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. దీంతో అక్కడ పోలీసులు, ఉద్యమకారుల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది.