: ట్రాప్ షూటర్ రంజన్ సోధీకి 'రాజీవ్ ఖేల్ రత్న'


డబుల్ ట్రాప్ షూటర్ రంజన్ సోధీ (35) ప్రతిష్ఠాత్మక 'రాజీవ్ ఖేల్ రత్న' అవార్డుకు ఎంపికయ్యాడు. 'ఖేల్ రత్న' దేశంలోని క్రీడాకారులకిచ్చే అత్యున్నత పురస్కారం. కాగా, ఈ అవార్డు అందుకుంటున్న ఏడో షూటర్ సోధీ. సోధీ 2011లో ప్రపంచ టైటిల్ ను నిలుపుకున్నాడు. అంతకుముందు 2010లో ఆసియా గేమ్స్ లో స్వర్ణం, అదే ఏడాది జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో రెండు రజతాలు చేజిక్కించుకున్నాడు. కాగా, హైదారబాదీ షూటర్ గగన్ నారంగ్ కు ఈ పురస్కారం 2010-11లో లభించింది.

  • Loading...

More Telugu News