: లోక్ సభ లో సేమ్ సీన్
గందరగోళ పరిస్థితుల మధ్య లోక్ సభ వాయిదా పడింది. ప్రశ్నోత్తరాల సమయం నడుస్తుండగా.. ఓవైపు టీడీపీ ఎంపీల సమైక్యాంధ్ర నినాదాలు, మరోవైపు సోనియా అల్లుడు రాబర్ట్ వాద్రా భూ వ్యవహారంపై విపక్షాలు చర్చకు పట్టుబట్టడంతో సభలో వాడీవేడీ వాతావరణం నెలకొంది. దీంతో, సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు.