: 'సేవ్ ఆంధ్రప్రదేశ్' టీ షర్టులతో సభకు హాజరైన టీడీపీ ఎంపీలు
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ టీడీపీ ఎంపీలు చేస్తున్న నిరసన పార్లమెంటులో నేడూ కొనసాగుతోంది. అందులో భాగంగా నేడు ఆ పార్టీ ఎంపీలు 'సేవ్ ఆంధ్రప్రదేశ్' టీ షర్టులు ధరించి వినూత్న తరహాలో సమావేశాలకు హాజరయ్యారు. ఉభయసభలు ప్రారంభమైన వెంటనే తమ నిరసనను ఎప్పటిలాగే కొనసాగించారు. రాజ్యసభలో ఛైర్మన్ హమీద్ అన్సారీ ఎంత చెప్పినా సభ్యులు వినకపోవడంతో సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదాపడింది. అటు లోక్ సభ కూడా నిరసనలు, నినాదాల మధ్య కొనసాగుతోంది.