: కేసీఆర్ ను హతమారుస్తామంటూ ఆంధ్ర నక్సల్స్ పేరుతో లేఖ


కేసీఆర్ ను హతమారుస్తామంటూ తెలంగాణ భవన్ కు గుర్తు తెలియని వ్యక్తులు లేఖ రాశారు. ఈ మధ్యనే కొంత మంది వ్యక్తులు కేసీఆర్ హత్యకు కుట్ర పన్నుతున్నారని తెరాస నేతలు పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ప్రభుత్వం పాత బులెట్ ప్రూఫ్ వాహనం స్థానంలో కొత్త బులెట్ ప్రూఫ్ వాహనాన్ని ఆయనకు సమకూర్చింది. భద్రతను కూడ పెంచారు. కాగా తెలంగాణ భవన్ కు అందిన బెదిరింపు ఉత్తరం పార్టీ వర్గాల్లో కలకలం రేపింది. ఆంధ్ర నక్సల్స్ పేరుతో ఉన్న ఆ లేఖలో పదిరోజుల్లో కాల్చి చంపుతామని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News