: అందరితో చర్చించే నిర్ణయం తీసుకున్నాం: చిదంబరం


అన్ని రాజకీయ పక్షాలతో చర్చించిన తరువాతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై నిర్ణయం ప్రకటించామని కేంద్రమంత్రి చిదంబరం వెల్లడించారు. రాజ్యసభలో కాంగ్రెస్ నిర్ణయంపై జరిగిన వాడీ వేడి చర్చ అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై విపక్షాలు చేసిన విమర్శలు సరికావని అన్నారు. తాను హోం మంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ అంశంపై రెండు సమావేశాలు ఏర్పాటు చేశానని, అప్పుడు కొన్ని పార్టీలు వెల్లడించిన అభిప్రాయాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకున్నానని చిదంబరం తెలిపారు.

అయితే, ఇప్పుడు కొన్ని పార్టీలు తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నాయని మండిపడ్డారు. అయినప్పటికీ నిర్ణయం తీసుకోవాల్సింది కాంగ్రెస్ పార్టీయేనని స్పష్టం చేశారు. టీడీపీ అభిప్రాయం ప్రజాస్వామికమైనప్పుడు కాంగ్రెస్ వైఖరి తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. చత్తీస్ గఢ్, జార్ఖండ్ ఏర్పాటు ప్రకటన అనంతరం కార్యాచరణకు చాలా కాలం పట్టిందన్న సంగతిని ఆయన గుర్తు చేశారు.

  • Loading...

More Telugu News