: అధికారంలోకి వస్తే బ్రాహ్మణులకు ప్రత్యేక సమాఖ్య: చంద్రబాబు హామీ
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే బ్రాహ్మణులకు ప్రత్యేక సమాఖ్య ఏర్పాటు చేస్తామని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. అంతేగాకుండా శివాలయాల్లో పనిచేసే అర్చకులను బీసీ-డి గా పరిగణిస్తామని అన్నారు. ప్రస్తుతం భట్టిప్రోలు మండలం సూరేపల్లి వద్ద పాదయాత్ర సాగిస్తున్న బాబుకు హైదరాబాద్ నుంచి పెద్ద సంఖ్యలో వచ్చిన బ్రాహ్మణులు ఆశీస్సులు అందించారు.
తమ సమస్యల పట్ల బాబుకు ఓ వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ, అర్హులైన వారికి ఇళ్లు కట్టిస్తామని చెప్పారు. రేషన్ కార్డులు, ఉచిత ఆరోగ్య సౌకర్యం కల్పిస్తామన్నారు. అంతకుముందు భట్టిప్రోలులో బాబు చేనేత కార్మికులతో సమావేశమయ్యారు. నేతన్నలకు వడ్డీ లేని రుణాలు, రూ. 1000 ఫించన్, ఇంటితో పాటు వర్క్ షెడ్డు నిర్మిస్తామని హామీ ఇచ్చారు.