: నేటి అర్ధరాత్రి నుంచి తిరుమలకు బస్సులు నిలిపివేత
సమైక్యాంధ్ర ఉద్యమ నేపథ్యంలో ఈ అర్ధరాత్రి నుంచి తిరుమలకు బస్సులు నడిపే ప్రసక్తేలేదని కార్మిక సంఘాలు తెలిపాయి. నేటినుంచి ఆర్టీసీ కార్మికుల నిరవధిక సమ్మె నేపథ్యంలో తిరుమలకు మినహాయింపు ఇవ్వాలన్న టీటీడీ అభ్యర్ధనపై చర్చించిన కార్మిక సంఘాలు ఈ మేరకు నిర్ణయించాయి. ప్రైవేటు రవాణా వ్యవస్థను కూడా అడ్డుకుంటామని ఆర్టీసీ కార్మికులు హెచ్చరించారు.