: రాత్రికి లగడపాటి నివాసంలో సీమాంధ్ర కాంగ్రెస్ నేతల భేటీ
రాష్ట్ర విభజన నిర్ణయంపై అధిష్ఠానంపై ఒత్తిడి పెంచేందుకు సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు నడుం బిగించారు. ఢిల్లీలో ఈ రాత్రికి ఎంపీ లగడపాటి రాజగోపాల్ నివాసంలో భేటీ అవ్వాలని వారు నిర్ణయించుకున్నారు. రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఈ భేటీలో కేంద్రంతో పాటు పార్టీ హైకమాండ్ పైనా ఎలా ఒత్తిడి పెంచాలన్న దానిపై ఓ కార్యాచరణను రూపొందించనున్నారు.