: సీమాంధ్ర ప్రజాప్రతినిధుల ఉద్యమం తప్పుకాదు: రేణుకా చౌదరి


సమైక్య రాష్ట్రం కోసం సీమాంధ్ర ప్రజాప్రతినిధులు ఉద్యమాలు చేయటంపై రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి సానుకూలత వ్యక్తం చేశారు. తమ ప్రాంత ప్రజల మనోభావాలకు అనుగుణంగా అలా చేయటం ఏమాత్రం తప్పుకాదన్నారు. ఆనాడు తెలంగాణ కోసం ఇలాగే ఉద్యమాలు జరిగినప్పుడు అందరూ ఆకాశానికి ఎత్తారని, మరిప్పుడు అభ్యంతరమెందుకుని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య విధానంలో ఇవి సహజమేనని, జరుగుతూనే ఉంటాయన్నారు. అయితే, ఏం జరుగుతుందో వేచి చూడాలన్నారు రేణుక.

  • Loading...

More Telugu News