: కళ్లకు గంతలతో నిరసన తెలిపిన సచివాలయ ఉద్యోగులు
సచివాలయంలో సీమాంధ్ర ఉద్యోగులు వినూత్నంగా నిరసన తెలిపారు. సచివాలయంలో పనిచేస్తున్న సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఉద్యోగులు కళ్లకు గంతలు కట్టుకుని భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్నది గుడ్డి నిర్ణయమని సూచిస్తూ వీరు ఈ విధంగా నిరసన తెలిపారు.