: డేవిస్ కప్ జట్టు నుంచి మహేశ్ భూపతికి ఉద్వాసన
జాతీయ టెన్నిస్ సంఘంపై తిరుగుబాటు బావుటా ఎగరేసిన స్టార్ ఆటగాడు మహేశ్ భూపతి అందుకు మూల్యం చెల్లించుకున్నాడు! ఇండోనేషియాతో జరిగే డేవిస్ కప్ పోరుకు జట్టు నుంచి ఉద్వాసనకు గురయ్యాడు. అయితే, భూపతికి మద్దతుగా నిలిచిన సోమ్ దేవ్, యుకీ బాంబ్రి, సనమ్ సింగ్ లు ఆశ్చర్యకరంగా జట్టుకు ఎంపికయ్యారు.
గత నెలలో జరిగిన డేవిస్ కప్ ప్లే ఆఫ్ పోరులో భారత్.. దక్షిణ కొరియా చేతిలో ఓటమి పాలవడంతో ఆసియా-ఓషియానా స్థాయికి పడిపోయింది. ఇండోనేషియాతో పోరు ఏప్రిల్ 5 నుంచి 7 వరకు జరుగుతుంది.