: పివి సింధుకు లోక్ సభ అభినందనలు
చైనాలోని గ్వాంగ్జౌ వేదికగా జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో కాంస్యం గెలిచిన హైదరాబాదు క్రీడాకారిణి పీవీ సింధుకు లోక్ సభ అభినందనలు తెలిపింది. 'ప్రపంచ' టోర్నీలో 30 సంవత్సరాల తర్వాత సింగిల్స్ విభాగంలో సింధు రూపంలో ఓ భారత షట్లర్ పతకం సాధించడం పట్ల సభ హర్షం వ్యక్తం చేసింది. ఈ టోర్నీలో సింధు సెమీస్ లో ఓటమిపాలైన సంగతి తెలిసిందే.