: షారూక్ ఇఫ్తార్ విందు భళా.. హాజరైన రానా
ఆదివారం సాయంత్రం ముంబైలో బాలీవుడ్ హీరో షారూక్ ఖాన్ ఇచ్చిన ఇఫ్తార్ విందుకు హీరో దగ్గుబాటి రానా సహా ఎంతో మంది నటీనటులు, ప్రముఖులు తరలి వచ్చారు. దీంతో, షారూక్ నివాసం సెలబ్రిటీలతో కళకళలాడిపోయింది. అమితాబ్ కుటుంబం అంతా షారూక్ ఇంట దిగిపోయింది. కొడుకు అభిషేక్, కోడలు ఐశ్వర్య, మనుమరాలు ఆరాధ్య, కూతురు శ్వేత, మనవడు అగస్త్యతో కలిసి బిగ్ బి ఈ విందుకు హాజరయ్యారు.
షారూక్ దంపతులకు ఇటీవల కలిగిన సంతానం అభ్ రామ్ ఆరాధ్యనీయుడంటూ అమితాబ్ ట్వీట్ చేశారు. దిలీప్ కుమార్, ఆయన భార్య సైరాభాను, అనిల్ కపూర్, సోనమ్ కపూర్, ఫరా ఖాన్, సుస్మితా సేన్, బోనీ కపూర్, శ్రీదేవి, లారా దత్తా, మహేశ్ భూపతి, సంజయ్ కపూర్, రవీనా టాండన్, అనిల్ తడాని, జాకీ ష్రాఫ్, వ్యాపార దిగ్గజం ముకేశ్ అంబానీ, భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ తదితరులు హాజరయ్యారు.