: అంటార్కిటిక్‌ ఓజోన్‌ రంధ్రంతో వేడెక్కనున్న భూమి


ఓజోన్‌ పొరకు అంటార్కిటిక్‌ ధ్రువం వద్ద ఏర్పడిన రంధ్రం ప్రభావంగా వాతావరణంలోను, మేఘాల అమరికలోనూ మార్పులు వచ్చి.. గ్లోబల్‌ ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతాయని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. చాలా మంది పరిశోధకులు గ్లోబల్‌ ఉష్ణోగ్రతలు పెరుగుతుండడానికి ఓజోన్‌ పొరకు పడిన రంధ్రమే కారణం అని నమ్ముతున్నట్లుగా అధ్యయన శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

తాజాగా ఒక సరికొత్త కంప్యూటర్‌ మోడలింగ్‌ అధ్యయనం మరో విషయాన్ని కూడా చెబుతోంది. ఓజోన్‌ పొరకు రంధ్రం వలన.. వేడి పెరగడం కొంత వరకు నిజమే కానీ, గాలులపై దాని ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. గాలులపై ప్రభావం ఎక్కువ కావడం వలన అవి మేఘాలను ధ్రువం నుంచి దూరంగా పంపేస్తాయని.. దానివలన బహుశా వేడి పెరుగుతూ ఉండవచ్చునని అంటున్నారు.

  • Loading...

More Telugu News