: కాగ్రెస్ పోవాలి.. బీజేపీ రావాలి : వెంకయ్య నాయడు
దేశ ప్రజలు కాంగ్రెస్ పోవాలి, బీజేపీ అధికారంలోకి రావాలని కోరుతున్నారని బీజేపీ సీనియర్ నాయకుడు వెంకయ్యనాయుడు అన్నారు. నవభారత యువభేరి సభలో ఆయన మాట్లాడుతూ కులమతాలకతీతంగా ప్రజలు మోడీ సభకు రావడం అభినందనీయమన్నారు. కాంగ్రెస్ పాలనలో అవినీతి సర్వాంతర్యామిగా మారిందని విమర్శించారు. దేశ ప్రజలను కుల, మత, ప్రాంతాలకు అతీతంగా చీల్చిన పార్టీ కాంగ్రెస్సే నని మండిపడ్డారు.