: లింగ నిర్ధారణ అనవసరం: షారూక్
లింగ నిర్ధారణ పరీక్షల వివాదాల్లో చిక్కుకున్న షారూక్ ఖాన్ బయటపడే ప్రయత్నం చేశారు. లింగ నిర్థారణ ప్రక్రియ అనేది అనవసరమని చెప్పారు. తన జీవితంలో కష్ట సమయాలను సంతోషంతో దాటే ప్రయత్నం చేస్తానని చెప్పారు. అద్దె గర్భం ద్వారా మరోసారి తండ్రి అయిన షారూక్, ఆ శిశువు కడుపులో ఉండగా.. లింగ నిర్ధారణ పరీక్షలు చేయించినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇదే అంశానికి సంబంధించి ముంబైలోని ఒక కోర్టులో షారూక్ దంపతులపై కేసు కూడా దాఖలైంది.