: పిల్లాడి శరీరం నుంచి మంటలు
తమిళనాడుకు చెందిన మూడు నెలల చిన్నారి చాలా అరుదైన సమస్యతో బాధపడుతున్నాడు. అతడి శరీరం నుంచి అప్పుడప్పడు మంటలు ఎగసిపడుతున్నాయి. దీంతో అతడి చర్మం కాలిపోతోంది. పుట్టిన తర్వాత 9వ రోజు మొదటి సారిగా అతడి శరీరం నుంచి మంటలు వచ్చాయి. ఈ మూడు నెలల కాలంలో ఇలా మూడు సార్లు జరిగింది. కాలిన గాయలతో అతడు చికిత్స పొందుతున్నాడు.
దీనిని స్పాంటేనియస్ హ్యూమన్ కంబస్టన్ అనే అరుదైన వైద్య సమస్యగా కిల్పక్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ కు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ తెన్ మోంజి చెప్పారు. ఈ పరిస్థితిలో శరీరం నుంచి మండే స్వభావమున్న వాయువులు విడుదల అవుతుంటాయని తెలిపారు. ఇలాంటి కేసును తాను చూడడం ఇదే మొదటి సారి అని చెప్పారు. చాలా ప్రమాదకరమైన కేసని, చెమట ద్వారా మండే స్వభావమున్న పదార్థాలు వెలువడుతున్నాయని చెప్పారు. ఎన్నో ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఇలాంటి కేసులకు ప్రత్యేకమైన చికిత్స ఏమీ లేదని, మంటలు వచ్చినప్పుడు కాలిన గాయలకు చికిత్స చేయడమే పరిష్కారమన్నారు. ఆ పిల్లాడిని చెమట పట్టని వాతావరణంలో ఉంచి వైద్యులు పరిశీలిస్తున్నారు.