: సికింద్రాబాదులో తనిఖీలు ముమ్మరం చేసిన పోలీసులు
దిల్ సుఖ్ నగర్ జంట బాంబు పేలుళ్ల ఘటనతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. నగరంలోని పలుచోట్ల తనిఖీలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా సికింద్రాబాదులో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తులను అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అలాగే రైల్వేస్టేషన్ సమీపంలోని లాడ్జీలకు వచ్చే వారికి గుర్తింపు కార్డులుంటేనే గదులు అద్దెకు ఇవ్వాలని నిర్వాహకులకు పోలీసులు సూచించారు.