: ఎంపీల రాజీనామాలు పరిశీలిస్తున్నాం: మీరా కుమార్


తెలంగాణ అంశంపై ఎంపీల రాజీనామాలు పరిశీలనలో ఉన్నాయని లోక్ సభ స్పీకర్ మీరా కుమార్ అన్నారు. మీరా కుమార్ ఈ ఉదయం హైదరాబాదు విచ్చేశారు. నగరంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బంజారాహిల్స్ లో ఓ ఆర్ట్ గ్యాలరీని ప్రారంభించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం ఎనిమిది మంది ఎంపీల రాజీనామాలు తమ ముందున్నాయని, వాటిని పరిశీలించి ఓ నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ తో పాటు డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, ఇతర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.

  • Loading...

More Telugu News