: వచ్చే ఏడాది 'ఐపీఎల్' ఛైర్మన్ గా ఉండను: రాజీవ్ శుక్లా


ఐపీఎల్ ఆరవ సీజన్ లో బయటపడ్డ స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ వ్యవహారం ఇంకా సద్దుమణగలేదు. ఈ టోర్నీతో సంబంధం వున్న ప్రతి ఒక్కరూ అప్పుడు రాజీనామా చేసినవాళ్లే. అదే సమయంలో ఐపీఎల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా తన పదవికి రాజీనామా చేశారు. దీనిపై తాజాగా శుక్లా మాట్లాడుతూ.. వచ్చే ఏడాది ఎట్టి పరిస్థితుల్లోనూ ఐపీఎల్ ఛైర్మన్ పదవిని తీసుకోనని స్ఫష్టం చేశారు. జైపూర్ లో ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. బీసీసీఐ బోర్డు తాత్కాలిక అధ్యక్షుడుగా ఉన్న జగ్ మోహన్ దాల్మియా ఇంతవరకు తన రాజీనామాను ఆమోదించలేదని చెప్పారు. అందువల్లే తాను ప్రస్తుతం లండన్ లో జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ సమావేశాలకు అధ్యక్షత వహిస్తున్నానన్నారు. కాగా, సెప్టెంబర్ 21 నుంచి జైపూర్ లో ఛాంపియన్స్ ట్రోఫీ మొదలవుతుందని వెల్లడించారు. చివరి మ్యాచ్ ఢిల్లీ వేదికగా అక్టోబర్ 6న జరుగుతుందన్నారు.

  • Loading...

More Telugu News