: కేసీఆర్ ది తప్పులేదు: కేకే
కేసీఆర్ మాట్లాడిన మాటల్లో తప్పులేదని కె.కేశవరావు తెలిపారు. హైదరాబాదులో టీఆర్ఎస్ భవన్ లో మాట్లాడుతూ.. కేసీఆర్ వ్యాఖ్యలను కొండ్రు, లగడపాటి, ఉండవల్లి తప్పు పట్టడం సరికాదని అన్నారు. రికార్డులు సరిచూసుకుంటే చారిత్రక సత్యాలు తెలుస్తాయని హితవు పలికారు. జయప్రకాశ్ నారాయణ మేధోమథనం జరిపారు మంచిదే కానీ, ఆయన నిష్పాక్షికంగా మాట్లాడాలని కేకే సూచించారు.