: హైదరాబాదులో రేపు ట్రాఫిక్ ఆంక్షలు
నరేంద్ర మోడీ 'నవభారత యువభేరి' సభ నేపథ్యంలో రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి 7 గంటల వరకు హైదరాబాదులో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నాంపల్లి, బషీర్ బాగ్, రవీంద్రభారతి, అబిడ్స్, లిబర్టీ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు అదనపు ట్రాఫిక్ కమిషనర్ అమిత్ గార్గ్ వెల్లడించారు. కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాల నుంచి సభకు వచ్చే వాహనాలకు ఎన్టీఆర్ స్టేడియంలో.. మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల నుంచి వచ్చే వాహనాలకు ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో.. రంగారెడ్డి, హైదరాబాదు జిల్లాల వాహనాలకు పబ్లిక్ గార్డెన్స్ లో పార్కింగ్ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఇక కార్లు, ద్విచక్ర వాహనాలకు నిజాం కళాశాల గ్రౌండ్స్, స్టాన్లీ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఏర్పాట్లు చేసినట్టు గార్గ్ పేర్కొన్నారు.