: సొమ్మసిల్లి పడిపోయిన మంత్రి
మంత్రి తోట నరసింహం తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే ఆయనను అన్నవరం దేవస్థానం అసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా జగ్గంపేట నుంచి అన్నవరం వరకు నిర్వహించిన బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం మంత్రి స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చి ఆలయంలో హఠాత్తుగా పడిపోయారు.