: చంద్రబాబు రంగులు మార్చారట!


తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి రంగులు మార్చారని టీఆర్ఎస్ నేత వినోద్ ఆరోపించారు. ప్రధానికి బాబు లేఖ రాయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాదులో ఈ ఉదయం మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు తన హయాంలోనే హైదరాబాదు అభివృద్ధి జరిగిందని చెప్పుకుంటున్నాడని, ఆయన పీఠం ఎక్కక ముందే ఐటి రంగం వేళ్ళూనుకుందని వెల్లడించారు. ఇక సీఎం కిరణ్ ను కూడా బాబుతో జతకలుపుతూ.. తెలంగాణను అడ్డుకోవడమే వీరిద్దరి పని అని ఆరోపించారు.

రాష్ట్ర విభజన జరిగితే సమస్యలొస్తాయని చెప్పడం కాదని, పరిష్కారాలు సూచించాలని వినోద్.. కిరణ్, బాబులకు హితవు పలికారు. ప్రస్తుతం సీమాంధ్రలో జరుగుతోంది ఉద్యమం కాదని, సమ్మె రూపంలో రాజకీయ ఆధిపత్య పోరు అని అభివర్ణించారు. టీడీపీ, కాంగ్రెస్, వైఎస్సార్సీపీ ఒకరిపైఒకరు పైచేయి సాధించడం కోసం కొట్లాడుకుంటున్నాయని విమర్శించారు.

  • Loading...

More Telugu News