: మలేరియాకూ టీకా వుంది!
వివిధ రకాల వ్యాధులను నివారించేందుకు టీకాలను వేయించుకుంటుంటాం. అయితే మలేరియా వ్యాధికి మాత్రం సరైన టీకాలు లేవు. తాజాగా తాము మలేరియా వ్యాధిని సమర్థవంతంగా ఎదుర్కొనే కొత్త టీకాను అభివృద్ధి చేసినట్టు వైద్యులు చెబుతున్నారు.
అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు మలేరియా వ్యాధికి ఒక కొత్తరకం టీకాను రూపొందించారు. తాము అభివృద్ధి చేసిన టీకా మంచి ఫలితాలను ఇస్తోందని వారు చెబుతున్నారు. 15 మందిలో 12 మందిని తాము కనుగొన్న టీకా మలేరియా వ్యాధినుండి కాపాడిందని శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రస్తుతం ఇది ప్రాథమిక ఔషధ పరీక్ష దశలో ఉందని, మలేరియా బాధితుల శరీరంలోకి బలహీన మలేరియా పరాన్నజీవిని ఎక్కించడం ద్వారా రోగిలో రోగనిరోధక శక్తిని పెంపొందించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.