: కస్టమర్ ని ఇబ్బంది పెట్టినందుకు స్పైస్ జెట్ కి లక్ష జరిమానా


స్పైస్ జెట్ కి ఢిల్లీ వినియోగదారుల ఫోరం లక్ష రూపాయల జరిమానా విధించింది. గోవా నుంచి ఢిల్లీ వెళుతున్న ఓ కుటుంబానికి స్పైస్ జెట్ విమానంలో టికెట్లు కన్ఫర్మ్ అయ్యాయి. అయితే, అదేమీ పట్టించుకోని సదరు విమానయాన సంస్థ అధికారులు ఆ కుటుంబంలో కొంతమందికి మరో విమానంలో సీట్లు కేటాయించారు. వేర్వేరు విమానాల్లో పంపించడంవల్ల తాము చాలా ఇబ్బందులు పడ్డామని ఢిల్లీలోని వినియోగదారుల ఫోరంలో ఆ కుటుంబం ఫిర్యాదు చేసింది. సంస్థ అలా ప్రవర్తించడానికి ప్రత్యేక కారణం ఏదీ లేదని, పరిమితికి మించి టికెట్లు బుక్ చేయడం వల్లే అలాంటి పరిస్థితి తలెత్తిందని విచారణలో తేలింది. ప్రయాణీకులకు అసౌకర్యం కలిగించే రీతిలో, తప్పుడు విధానాలు అవలంబించినందుకు విమానయాన సంస్థకు లక్ష రూపాయల జరిమానా విధించింది.

  • Loading...

More Telugu News