: ప్రజలే మమ్మల్ని నడిపిస్తున్నారు: శైలజానాథ్
ప్రజలే సీమాంధ్ర ఉద్యమానికి దిశానిర్దేశం చేస్తున్నారని మంత్రి శైలజానాథ్ వ్యాఖ్యానించారు. సీమాంధ్రలో ఇప్పుడు ప్రజలే ఉద్యమాన్ని నడిపిస్తున్నారని, వారి నాయకత్వంలోనే తాము పనిచేస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. శైలజానాథ్ అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. అందుకోసం తామేం చేయాలో అదే చేస్తామని చెప్పారు. తమ ఒత్తిడి వల్లే ఆంటోనీ కమిటీ ఏర్పాటు చేశారని మంత్రి పేర్కొన్నారు. వ్యక్తిగతంగా అనంతపురం జిల్లాను కాపాడుకోవాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. ఇక, ఆందోళనల్లో భాగంగా ఇందిర, రాజీవ్ విగ్రహాలు కూల్చొద్దని సూచించారు.