: సంక్షేమ పథకాల ప్రచారానికి ప్రభుత్వ మీడియా విభాగం


సార్వత్రిక ఎన్నికలు త్వరలో సమీపిస్తుండటంతో సంక్షేమ పథకాల ప్రచారానికి కేంద్ర ప్రభుత్వం సామాజిక మీడియాను అస్త్రంగా ఉపయోగించుకోవాలని నిర్ణయించింది. ఇందుకోసం ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా సైట్లలో సందేశాలిచ్చేందుకు ప్రత్యేక మీడియా విభాగం ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదనను కేంద్ర సమాచార, ప్రసారశాఖ తయారుచేసింది. ఈ వ్యవస్థ కోసం 12వ పంచవర్ష ప్రణాళిక కాలంలో రూ.22 కోట్లపైన ఖర్చవుతుందని అంచనా వేసింది.

  • Loading...

More Telugu News