: యూఎస్ ఓపెన్ లో మోనికా సెలెస్ కు ఘన సన్మానం
ప్రఖ్యాత టెన్నిస్ క్రీడాకారిణి మోనికా సెలెస్ ను అమెరికాలో ఘనంగా సన్మానించనున్నారు. సెప్టెంబర్ 8 ను యూఎస్ ఓపెన్ మహిళల ఫైనల్ మ్యాచ్ కి ముందు సెలెస్ ను సత్కరిస్తారని అంతర్జాతీయ వార్తా సంస్థలు పేర్కొన్నాయి. రెండుసార్లు యూస్ ఓపెన్ విజేతగా నిలిచిన మోనికా సెలెస్ తన కెరీర్ లో 9 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలుచుకుంది. 2009 లోనే సెలెస్ ఇంటర్నేషనల్ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్ లో చోటు సంపాదించుకుంది. తిరుగులేని క్రీడాకారిణిగా పేరొందిన సెలెస్ ను సన్మానించనుండడం ఆమె అభిమానులతో పాటు టెన్నిస్ ప్రియులకు అమితానందాన్నిస్తోంది.