: షారుక్, గౌరీ ఖాన్ లపై కేసు నమోదు


బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్, ఆయన భార్య గౌరిపై ముంబై స్థానిక కోర్టులో కేసు నమోదైంది. ఇటీవల సరోగసీ (అద్దె గర్భం) ద్వారా వీరు సంతానాన్ని పొందిన సంగతి తెలిసిందే. ఆ బిడ్డ ఆడా, మగా అని తెలుసుకునేందుకు లింగ నిర్ధారణ పరీక్షలు చేయించారంటూ వర్షా దేశ్ పాండే అనే మహిళా న్యాయవాది కోర్టులో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దీనిపై విచారించిన అదనపు చీఫ్ మెట్రో పాలిటన్ మేజిస్ట్రేట్ షారుక్ దంపతులతో పాటు కార్పోరేషన్ ఆరోగ్య శాఖాధికారులకు కూడా నోటీసులు జారీ చేశారు. లింగనిర్ధారణకు సంబంధించి మీడియాలో కథనాలు రావడంతో, తొలుత బృహన్ ముంబై మునిసిపల్ కార్పోరేషన్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినా సరైన స్పందన లేనందువల్లే కోర్టుకు వెళ్లినట్లు వర్ష చెప్పారు.

  • Loading...

More Telugu News