: దిల్ సుఖ్ నగర్ లో సాధారణ పరిస్థితులు
వరుస పేలుళ్లతో నెత్తురోడిన దిల్ సుఖ్ నగర్ ప్రాంతంలో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. నగరంలో ప్రముఖ వ్యాపార కేంద్రంగా పేరుగాంచిన ఈ ప్రాంతం భయం గుప్పిట్లో నుంచి క్రమంగా తేరుకుంటోంది. తీవ్రవాదుల దాడిలో 16 మంది మృతి చెందినా.. ఆ గాయం తాలూకు ఆనవాళ్లు ఇంకా మిగిలే ఉన్నా.. ప్రజల ఆత్మస్థయిర్యం ముందు అవన్నీ వెలవెలపోయాయి.
దుకాణదారులు, చిరు వ్యాపారులు, కాలేజీ విద్యార్థులు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులతో యధావిధిగానే సందడిగా కనిపిస్తోంది. సంఘటన స్థలంలో రెండ్రోజుల పాటు సాగిన పోలీసు దర్యాప్తు బృందాల హడావిడి నేడు కాస్త నెమ్మదించింది.