: ప్రతిపక్షాలు అనుమతిస్తే ఈ సమావేశాల్లోనే లోక్ పాల్ బిల్లు: దిగ్విజయ్
చాలా రోజుల తర్వాత లోక్ పాల్ బిల్లుపై కాంగ్రెస్ తరపున ఏఐసీసీ జనరల్ సెక్రటరీ దిగ్విజయ్ సింగ్ మాట్లాడారు. ప్రతిపక్షాలు అంగీకారం తెలిపితే ప్రస్తుత వర్షాకాల సమావేశాల్లోనే లోక్ పాల్ బిల్లును ప్రవేశపెడతామని పనాజీలో మీడియాతో తెలిపారు. ఆ వెంటనే బిల్లు చట్టంగా మారేలా చూస్తామన్నారు. 2009లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో లోక్ పాల్ చట్టం కాంగ్రెస్ చేసిన వాగ్దానాల్లో ఒకటని చెప్పారు. ఇక మహిళా రిజర్వేషన్ బిల్లును తెచ్చేందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కృషి చేస్తున్నారని.. దాన్ని ఆమోదించాలా, వద్దా? అనేది ఎంపీల నిర్ణయమని దిగ్విజయ్ అన్నారు.