: ఉత్తరాఖండ్ బాధితుల కోసం ఐశ్వర్యరాయ్ నృత్యం


ఉత్తరాఖండ్ వరద బాధితులకోసం బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ తన వంతు సహాయం చేసేందుకు ముందుకొచ్చింది. ఇందుకోసం పలువురు బాలీవుడ్ నటీనటులతో నిర్వహించే టెలివిజన్ షోలో నర్తించనుంది. ఇందులో దాదాపు దేశభక్తి పాటలకు ఐశ్వర్య నృత్యం చేయనుంది. ఈ కార్యక్రమంలో అభిషేక్ బచ్చన్ కూడా పాల్గొననున్నాడు. దీనిద్వారా వచ్చిన నిధులను ఉత్తరాఖండ్ బాధితులకు అందించనున్నారని ప్రముఖ వార్తా వెబ్ సైట్ తెలిపింది.

అమితాబ్ బచ్చన్, బిపాసాబసు, మాధురీ దీక్షిత్, అభయ్ డియోల్, నేహా ధూపియా వంటి పలువురు స్టార్లు తమ అదిరిపోయే పెర్ఫార్మెన్స్ ను ఇవ్వనున్నారు. సంగీత మాంత్రికుడు ఏ ఆర్ రెహమాన్, గాయకురాలు లతా మంగేష్కర్ తమ పాటలతో ప్రేక్షకులను అలరించనున్నారు.

  • Loading...

More Telugu News