: టీ ఎంప్లాయీస్ యూనియన్ల ప్రతిపాదన తిరస్కరించిన సీమాంధ్ర ఉద్యోగులు
ఈ నెల 12న తమతో భేటీ కావాలంటూ తెలంగాణ ఉద్యోగ సంఘం చేసిన విజ్ఞప్తిని సీమాంధ్ర ఉద్యోగ సంఘాలు సున్నితంగా తిరస్కరించాయి. సీమాంధ్ర ప్రజల ఆందోళనలను ప్రతిబింబించేలా ఉద్యమం చేస్తున్నాము తప్ప, తెలంగాణ ఉద్యోగులకు వ్యతిరేకంగా కాదన్న విషయాన్ని వారు గుర్తించాలని కోరారు. కేంద్రం విధివిధానాలు ప్రకటించకముందే సమావేశమవడం అర్థరహితమని సీమాంధ్ర ఉద్యోగులు అభిప్రాయపడ్డారు. అక్కడి ప్రజల్లో తాము కూడా ఒక భాగమన్న విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని వారు స్పష్టం చేశారు.