: ఫుట్ బాల్ కు ధోనీ సేవలు
భారత క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నాడు. క్రికెట్ తరువాత తనకి అత్యంత ఇష్టమైన ఫుట్ బాల్ క్రీడకు తన సేవలు అందించేందుకు సిద్ధమవుతున్నాడు. ఆటగాడిగా కాందండోయ్, బార్ క్లేస్ ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ కు భారత్ లో బ్రాండ్ అంబాసిడర్ గా అలరించనున్నాడు. మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్ కు ధోనీ వీరాభిమాని. ధోనీ సెలవు రోజుల్లో తీరిగ్గా ఉంటే ఫుట్ బాల్ చూస్తూ ఆనందిస్తాడన్న సంగతి తెలిసిందే. అందుకే దేశంలో ఎంతోమంది వీరాభిమానులున్న ధోనీని బ్రాండ్ అంబాసిడర్ గా ఎన్నుకుంది ఈఎస్పీఎన్ ఛానెల్. త్వరలో ప్రారంభం కానున్న ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ ఫుట్ బాల్ ప్రసారాల్లో తొలిసారిగా హిందీ కామెంటరీ కూడా జత చేయనున్నారు. దీంతో భారతీయుల్లో ఫుట్ బాల్ ఆదరణ పొందుతుందని సాకర్ టోర్నీ ప్రసారకర్తలు ఆశిస్తున్నారు.