: ముగ్గురితో మాట్లాడి రెండు ముక్కలు చేశారు: తలసాని


మాజీ మంత్రి, హైదరాబాదు టీడీపీ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ రాష్ట్ర విభజన అంశంపై స్పందించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో జరిగిన ప్రపంచ చేనేత దినోత్సవంలో తలసాని మాట్లాడుతూ, కేవలం ముగ్గురితో మాట్లాడి రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేశారని దుయ్యబట్టారు. సోదరులను విడదీసేటప్పుడు కూడా ఇరుపక్షాలతో మాట్లాడే నిర్ణయం తీసుకుంటారని, కానీ, రాష్ట్రం విషయంలో సీఎం, డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్ లతో చర్చించి రాష్ట్రాన్ని విభజించారని తలసాని మండిపడ్డారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేసేందుకు అవసరమైన ఎంపీ సీట్ల కోసం సోనియా ఇలాంటి విభజన రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ తన తొందరపాటు చర్యతో ఓ మంచి రాష్ట్రాన్ని విడగొట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News