: మనిషినుండి కూడా బర్డ్‌ ఫ్లూ వస్తోంది!


బర్డ్‌ ఫ్లూ వ్యాధి సాధారణంగా కోళ్ళనుండి మనుషులకు వ్యాపించి, ప్రాణాంతకంగా పరిణమిస్తుంది. అయితే తాజాగా ఈ బర్డ్‌ ఫ్లూ వ్యాధి మనిషి నుండి మనిషికి సోకి ప్రాణాంతకంగా పరిణమించిన విషయాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు.

చైనాలో గత మార్చినుండి బర్డ్‌ ఫ్లూ వ్యాధి సోకి సుమారు 40 మంది మరణించారు. ప్రాణాంతక హెచ్‌7ఎన్‌9 బర్డ్‌ఫ్లూ వైరస్‌ ఇప్పటి వరకూ ఫౌల్ట్రీల్లో పనిచేసేవారికి వ్యాపించేది. అయితే తాజాగా ఈ వైరస్‌ మనిషి నుండి మరో మనిషికి సోకి ప్రాణాంతకంగా మారిన విషయాన్ని చైనా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇలా బర్డ్‌ఫ్లూ వైరస్‌ మనిషి నుండి మనిషికి వ్యాప్తిచెందింది అనడానికి తమవద్ద స్పష్టమైన ఆధారాలున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తూర్పు చైనాలో ఒక తండ్రీ కూతుళ్ల కేసును ఈ సందర్భంగా వైద్యులు ఉదహరించారు. తండ్రి కోళ్ల పరిశ్రమలో పనిచేసేవారని, ఆయన బర్డ్‌ఫ్లూతో మరణించారని, ఆయన కుమార్తెకు కోళ్ల పరిశ్రమతో ఎలాంటి సంబంధం లేదని అయినా కూడా 32 ఏళ్ల కుమార్తె కూడా ఈ వైరస్‌ బారిన పడడం గమనార్హమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలా జరగడం అరుదని కూడా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News