: మాజీ మంత్రి విజయరామారావు టీఆర్ఎస్ కు గుడ్ బై ?
మాజీ మంత్రి విజయరామారావు టీఆర్ఎస్ కు రాజీనామా చేస్తునట్టు సమాచారం. ఫాంహౌస్ లో కేసీఆర్ తో భేటీ అయి తన రాజీనామా లేఖను ఇచ్చినట్టు తెలుస్తోంది. వరంగల్ ఎంపీ సీటుఫై హామీ ఇవ్వనందువల్ల ఆయన అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. దీంతో గత కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. రెండు రోజుల క్రితమే దిగ్విజయ్ సింగ్ ను కలిసినట్టు తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఆయన బాటలోనే మరికొంత మంది నేతలు పయనించనున్నట్టు తెలుస్తోంది.