: నాగార్జున సాగర్ కు భారీగా వరద నీరు


నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఎగువనుంచి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు 18 గేట్లు ఎత్తివేసి 1.46 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి 4.50 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ఇన్ ఫ్లో పెరిగితే మిగతా గేట్లు ఎత్తే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు, గోదావరి ఉద్ధృతి క్రమంగా తగ్గుతుండడంతో రెండో నెంబర్ ప్రమాద హెచ్చరికను అధికారులు ఉపసంహరించుకున్నారు. ప్రస్తుతం ధవళేశ్వరం వద్ద నీటిమట్టం 13.70 అడుగులు ఉండగా 13.22 క్యూసెక్కుల నీరు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.

  • Loading...

More Telugu News