: కేంద్రం తన నిర్ణయాన్ని వాపస్ తీసుకుంటుంది: గంటా ఆశాభావం


కేంద్రం తెలంగాణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటుందని భావిస్తున్నామని రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖలో ఆయన మాట్లాడుతూ ఆగస్టు 15 తరువాత రాజకీయేతర జేఏసీ ద్వారా ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని తెలిపారు. సకల జనుల సమ్మెకు కూడా సన్నాహాలు చేస్తున్నామని ఆయన వెల్లడించారు.

కాగా, కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆహార భద్రత బిల్లు పాస్ అయ్యేవరకు కాంగ్రెస్ ఎంపీలు, కేంద్ర మంత్రులు రాజీనామాలు ఇవ్వకుండా నాన్చి, ఆ తరువాత ఉద్యమం పేరుతో రాజీనామాలు చేసి కొత్త నాటకానికి తెరదీస్తున్నారని మండిపడ్డారు. చిత్తశుద్ధి ఉంటే రాజీనామాలు చేసి బయటికొచ్చి ఉద్యమంలో పాల్గొనాలని సవాలు విసిరారు. రోజూ కాంగ్రెస్ ఎంపీలు, కేంద్ర మంత్రులు సమావేశం పేరుతో సీమాంధ్ర ప్రజలను ఎలా మభ్యపెట్టాలా? అని ప్రణాళికలు వేసుకుంటున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ నేతల బండారం బయటపడే రోజు ముందుందని టీడీపీ నేతలు విమర్శించారు.

  • Loading...

More Telugu News