: ఏపీలో 8 మందితో ఎన్నికల మేనిఫెస్టో అమలు కమిటీ
విభజన ప్రకటన తదనంతర పరిణామాలతో రాష్ట్రం అట్టుడికిపోతోంది. లక్షలమంది ప్రజలు రోడ్లపై నిరసన తెలుపుతూ రగిలిపోతున్నారు. సందట్లో సడేమియా అన్నట్టు కాంగ్రెస్ అధిష్ఠానం ఆంధ్రప్రదేశ్ లో 8 మంది సభ్యులతో ఎన్నికల మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు చేసింది. ఏకే ఆంటోనీ నేతృత్వంలో నారాయణ స్వామి, దిగ్విజయ్ సింగ్, పీసీసీ చీఫ్ బొత్స, సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, తిరునావుక్కరసు, కుంతియా, ఉండవల్లి, గీతా రెడ్డి సభ్యులుగా ఈ కమిటీ పని చేయనుంది.