: ప్రధాని బొమ్మలా కూర్చున్నారు: టీడీపీ ఎంపీలు


ప్రధాని మన్మోహన్ సింగ్ తీరుపై తెలుగుదేశం పార్టీ ఎంపీలు మండిపడ్డారు. లోక్ సభలో తాము ప్లకార్డులు పట్టుకుని ఆయన ఎదురుగానే సమైక్యాంధ్ర నినాదాలు చేస్తున్నా పట్టించుకోలేదని శివప్రసాద్, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉలుకుపలుకు లేకుండా బొమ్మలా కూర్చున్నారని విమర్శించారు. ఇక ఆయన పక్కనే ఉన్న యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ వీరిద్దరినీ పక్కకు తొలగండని ఆదేశించింది. అయితే, టీడీపీ ఎంపీలు పట్టువిడవక అలాగే నినదిస్తూ నిలుచుండి పోయారు. దీంతో, మంత్రి మునియప్ప వచ్చి వీరిని పక్కకు తీసుకెళ్ళాల్సి వచ్చింది.

  • Loading...

More Telugu News