: పది భాషల్లో విడుదలకు సిద్ధమైన 'చెన్నై ఎక్స్ ప్రెస్'


బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ నటించిన 'చెన్నై ఎక్స్ ప్రెస్' చిత్రం భారత్ లోనే కాక ఇతర దేశాల్లోనూ విడుదలవబోతోంది. మొత్తం పది భాషల్లో భారీ ఎత్తున రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైంది. షారుక్ కు దేశ, విదేశాల్లో అభిమానులు ఉండటంతో హిందీ, ఇంగ్లీషు, ఫ్రెంచ్, స్పానిష్ అరబిక్, జర్మన్, హిబ్రూ, డచ్, టర్కిష్, మలే భాషల్లో ఆయా దేశాల సబ్ టైటిల్స్ తో రిలీజ్ చేస్తున్నట్లు ఈ చిత్ర నిర్మాణ సంస్థకు చెందిన వ్యక్తి తెలిపారు. రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దీపికా పదుకొణే కథానాయికగా నటించింది.

  • Loading...

More Telugu News