: హిల్లరీకి ఒబామా ప్రశంసలు
అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ పై అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రశంసల జల్లు కురిపించారు. ఆమెను ఒక గొప్ప విదేశాంగ మంత్రిగా అభివర్ణించారు. హిల్లరీ క్లింటన్.. ఒబామా మొదటి టర్మ్ లో నాలుగేళ్ల పాటు విదేశాంగ మంత్రిగా పనిచేశారు. రెండోసారి ఒబామా తిరిగి అధ్యక్షుడయ్యాక.. ఆమె స్థానంలో జాన్ కెర్రీ బాధ్యతలు చేపట్టారు. పదవి నుంచి దిగిపోయిన తర్వాత హిల్లరీ, ఒబామా మళ్లీ కలవలేదు. ఈ నేపథ్యంలో ఆమెకు ఒబామా వైట్ హౌస్ లో విందు ఇచ్చారు. ఈ భేటీ అనంతరం ఒబామా ఆమెను పొగిడేశారు. 2016లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ డెమొక్రటిక్ పార్టీ తరఫున బరిలో దిగనున్న సంగతి తెలిసిందే. ఇదే విషయమై 2016లో హిల్లరీ క్లింటన్ వైట్ హౌస్ లో అడుగు పెడతారా? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు.. 'ఆమె గతంలోనూ వైట్ హౌస్ లో ఉన్నారు కదా?' అంటూ ఒబామా తెలివిగా తప్పించుకున్నారు.